
IPL 2025: ఢిల్లీపై గెలుపుతో చరిత్ర సృష్టించిన ముంబయి ఇండియన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో చివరికి ముంబయి ఇండియన్స్‌కి ఊపిరి లభించింది.
టోర్నీ ఆరంభంలో తొలిమారే ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరికి జారిన ముంబయి... తాజాగా దిల్లీ క్యాపిటల్స్‌పై 12 పరుగుల తేడాతో విజయం సాధించి కొత్త జోష్‌కు తెరలేపింది.
అంతేకాదు, ఈ గెలుపుతో ఓ అరుదైన రికార్డు కూడా ఖాతాలో వేసుకుంది. ఏప్రిల్ 13 (ఆదివారం) జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది.
నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. నమన్ ధీర్ 17 బంతుల్లో 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
Details
193 పరుగులకు ఢిల్లీ ఆలౌట్
రికిల్‌టన్ 41 పరుగులు, సూర్యకుమార్ 40 పరుగులు చేయడంతో ముంబయి భారీ స్కోర్ చేసింది.
దిల్లీ క్యాపిటల్స్ ఛేజింగ్‌లో కరుణ్ నాయర్ అద్భుతంగా ఆడి 40 బంతుల్లో 89 పరుగులు (12 ఫోర్లు, 5 సిక్సర్లు) సాధించినా.. టీమ్‌ను గెలుపు దాకా చేర్చలేకపోయాడు.
మ్యాచ్ ముగిసే సమయానికి దిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటయ్యింది. చివరి 9 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన దశలో వరుసగా మూడు రనౌట్లతో ఢిల్లీ ఆశలు ఆవిరయ్యాయి.
ఇంపాక్ట్ ప్లేయర్ కర్ణ్ శర్మ 3 వికెట్లు (3/36) తీసి ముంబయికి గెలుపునందించాడు.
Details
చరిత్రలోకి ముంబయి ఇండియన్స్
ఈ విజయంతో ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది.
టోర్నీలో తొలి ఇన్నింగ్స్‌లో 200+ పరుగులు చేసినప్పుడల్లా విజయం సాధించిన తొలి జట్టుగా ముంబయి నిలిచింది.
ఇప్పటి వరకు ఇలా 15 సార్లు 200కి పైగా స్కోరు చేసి అన్నింటిలోనూ గెలిచింది.
ఇతర జట్లు ఇలా ఉన్నాయి
దిల్లీ క్యాపిటల్స్ - 13 మ్యాచ్‌లు: 13 గెలుపులు
సీఎస్కే - 21 మ్యాచ్‌లు: 16 గెలుపులు, 5 ఓటములు
ఆర్సీబీ - 24 మ్యాచ్‌లు: 19 గెలుపులు, 5 ఓటములు
సన్‌రైజర్స్ - 17 మ్యాచ్‌లు: 15 గెలుపులు, 2 ఓటములు
ఈ గణాంకాలు చూస్తే, 200+స్కోర్‌ను అత్యంత సమర్థవంతంగా డిఫెండ్ చేసే జట్టుగా ముంబయి ఇండియన్స్ చరిత్రలో నిలిచింది.