IPL 2026: ముంబై కొంప ముంచేసిన ఆటగాడు.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్..
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన 58వ మ్యాచ్‌లో ముంబై ఫీల్డర్ నమన్ ధీర్ మరోసారి ఫీల్డింగ్‌లో నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న నమన్ ధీర్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను పట్టుకోలేక వదిలేశాడు. ఈ కీలక అవకాశాన్ని మిస్ చేయడంతో బౌలర్ బుమ్రా తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆ సమయంలో తక్కువ స్కోర్‌కే అవుట్ కావాల్సిన ప్రభ్‌సిమ్రాన్, లభించిన జీవదానాన్ని పూర్తిగా ఉపయోగించుకుని 57 పరుగుల దూకుడైన ఇన్నింగ్స్ ఆడాడు.
వివరాలు
ఒకే సీజన్‌లో ఎక్కువ క్యాచ్‌లు వదిలేసిన రికార్డు..
ఈ సీజన్‌లో నమన్ ధీర్ ఫీల్డింగ్ ముంబయి ఇండియన్స్‌కు పెద్ద సమస్యగా మారింది. ఇప్పటివరకు అతను ఏకంగా ఏడు క్యాచ్‌లను జారవిడిచాడు. దీంతో ఒకే సీజన్‌లో అత్యధిక క్యాచ్‌లు వదిలేసిన ఆటగాడిగా అనవసరమైన రికార్డు అతని పేరుకు చేరింది. అయితే సమస్య కేవలం అతనితోనే పరిమితం కాలేదు. మొత్తం ముంబై జట్టు ఫీల్డింగ్ కూడా దారుణ స్థాయిలోనే ఉంది. కీలక సందర్భాల్లో క్యాచ్‌లు మిస్ కావడం, మిస్‌ఫీల్డింగ్ వల్ల అదనపు పరుగులు ఇవ్వడం వంటి తప్పిదాలు మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయి.
వివరాలు
11 క్యాచ్‌లు వదిలేసి చెత్త రికార్డ్..
ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించి, ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా బయటపడింది. ఈ సీజన్‌లో జట్టు మొత్తం కలిపి 11 క్యాచ్‌లు వదిలేయడం గమనార్హం. స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఇలాంటి ప్రాథమిక తప్పిదాలు జరగడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వచ్చే సీజన్‌లో ఫీల్డింగ్ విభాగంలో పెద్ద మార్పులు అవసరమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.