Page Loader
మేజర్ క్రికెట్ లీగ్‌లో 'ముంబాయి న్యూయార్క్'గా అవతరించిన ముంబాయి ఇండియన్స్
ముంబాయి న్యూయార్క్ కొత్త లోగో

మేజర్ క్రికెట్ లీగ్‌లో 'ముంబాయి న్యూయార్క్'గా అవతరించిన ముంబాయి ఇండియన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 21, 2023
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌లో లీగ్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే వస్తోంది. తాజాగా అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ అమెరికాలోని డల్లాస్ లో జూలై 13 నుంచి 30 వరకూ జరగనుంది. కొందరు టాప్ ప్లేయర్స్ ఈ లీగ్‌తో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం. అయితే ముంబై ఇండియన్స్ మేజర్ లీగ్ క్రికెట్ ప్రారంభ ఎడిషన్ లో అడుగుపెట్టనుంది.ఇక న్యూయార్క్ టీమ్ ఓనర్ గా ముంబై ఇండియన్స్ ఉండనుంది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఐదుసార్లు ట్రోఫీని గెలుచుకుంది. రిలయన్స్ ఇండిస్ట్రీట్ లిమిటెడ్ యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని నిర్వహిస్తోంది. దీంతో ముంబాయి ఇండియన్స్ ఫ్యామిలీ మరింత పెరగనుంది.

ముంబై ఇండియన్స్

గ్లోబల్‌ బ్రాండ్‌గా ముంబై ఇండియన్స్‌

ఈ అంశంపై నీతూ అంబానీ స్పందించింది. ముంబై ఇండియన్స్ ఫ్యామిలీకి న్యూయార్క్ ఫ్రాంచైజీని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని, యూఎస్ లో మొదటి క్రికెట్ లీగ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నామని, ఫియర్‌లెస్‌, ఎంటర్‌టైనింగ్‌ క్రికెట్‌కి గ్లోబల్‌ బ్రాండ్‌గా ముంబై ఇండియన్స్‌ను నిలుపుతామని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను ఎక్స్‌ప్యాండ్‌ చేయడానికి, ప్రమోట్‌ చేయడానికి కృషి చేస్తోంది. ఇప్పటికీ దీని కింద ముంబై ఇండియన్స్ (IPL), MI కేప్ టౌన్ (SA20), MI ఎమిరేట్స్ (ILT20), ముంబై ఇండియన్స్ (WPL) జట్లు కూడా ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 మిలియన్ల డిజిటల్ ఫ్యాన్స్‌ అత్యధికంగా ఫాలో అవుతున్న గ్లోబల్ క్రికెట్ బ్రాండ్‌లలో ముంబై ఇండియన్స్ ఒకటిగా ఉంది.