Page Loader
Jasprit Bumrah : ఐపీఎల్ వేలానికి ముందు.. బుమ్రా గురించి కీలక ప్రకటన చేసిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ వేలానికి ముందు.. బుమ్రా గురించి కీలక ప్రకటన చేసిన ముంబై ఇండియన్స్

Jasprit Bumrah : ఐపీఎల్ వేలానికి ముందు.. బుమ్రా గురించి కీలక ప్రకటన చేసిన ముంబై ఇండియన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2023
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2024 మినీ వేలానికి ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అన్ని ఫ్రాంచేజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా, అవసరం లేని ఆటగాళ్లలను వేలానికి విడుదల చేశాయి. ఇంకా ఆటగాళ్ల ట్రేడింగ్ ప్రక్రియకు మాత్రం డిసెంబర్ 12వరకు గడువు ఉంది. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఆటగాళ్ల వేలం జరగనుంది. ఇప్పటికే ఈ వేలం కోసం 1166 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యా(Hardik Pandya) తిరిగి ముంబై గూటికి రావడం అందరినీ అశ్చర్యపరిచింది.

Details

బుమ్రా ఫోటోను షేర్ చేసిన ముంబై ఇండియన్స్

హార్దిక్ రాకతో బుమ్రా జట్టును వీడుతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ సమయంలో బుమ్రా 'మౌనంగా ఉండటమే కొన్నిసార్లు ఉత్తమ సమాధానం' అని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇక ముంబై ఇండియన్స్ పేజీని అతను అన్ ఫాలో చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా ముంబయి ఇండియన్స్ తన సోషల్ మీడియాలో బుమ్రా ఫోటోను షేర్ చేస్తూ 'మౌనంగా ఉండటమే కొన్నిసార్లు ఉత్తమ సమధానం అంటూ అదే కొటేషన్ పేర్కొంది. ఇంకోవైపు బుమ్రా మ‌ళ్లీ ముంబై ఇండియ‌న్స్ పేజీని తిరిగి ఫాలో చేయడం విశేషం. దీంతో ముంబై ఇండియన్స్ జట్టులో ఏ జరుగుతోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.