IPL 2023: భారీ టార్గెట్ ను చేధించలేకపోయిన ముంబై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. కెప్టెన్ శామ్ కర్రన్ 29 బంతుల్లో 55, హర్ ప్రీత్ భాటియా 28 బంతుల్లో 41, జితేశ్ శర్మ 7 బంతుల్లో 24 పరుగులు చేసి విజృంభించారు. ముంబై బౌలర్లలో పీయూస్ చావ్లా, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు, అర్జున్ టెండుల్కర్, బెరండ్రాఫ్, జోఫ్రా అర్చర్ తలో ఓ వికెట్ తీశారు. 16 ఓవర్‌లో అర్జున్ టెండుల్కర్ వైడ్, నోబ్ సహా 6,4,4,6,4,4,1 మొత్తంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు.
నాలుగు వికెట్లతో విజృంభించిన అర్షదీప్ సింగ్
భారీ టార్గెట్ ను చేధించే క్రమంలో బ్యాటింగ్ కి దిగిన ముంబై ఇండియన్స్ రెండో ఓవర్లలోనే ఇషాన్ కిషాన్ వికెట్ ను కోల్పోయింది. దీంతో కామెరూన్ గ్రీన్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. గ్రీన్(67), రోహిత్ (44), సూర్యకుమార్ యాదవ్ (57) విజృంభించినా ఫలితం లేకుండా పోయింది. చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా.. అర్షదీప్ రెండు వికెట్లు తీసి పంజాబ్ కు విజయాన్ని అందించాడు. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 4 వికెట్లు, ఇల్లీస్, లివింగ్ స్టోన్ తలా ఓ వికెట్ తీశారు.