
IPL 2025 :ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ బోణీ.. 8 వికెట్ల తేడాతో కోల్‌కతా పై గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.
అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలిచింది.
కోల్‌కతా నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని ముంబయి జట్టు కేవలం 12.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి అలవోకగా చేధించింది.
ముంబయి తరఫున రికెల్టన్ అర్ధశతకంతో (62*; 41 బంతుల్లో-4 ఫోర్లు-5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
సూర్యకుమార్ యాదవ్ (27*; 9 బంతుల్లో-3 ఫోర్లు-2 సిక్స్‌లు) దూకుడుగా రాణించాడు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ 2 వికెట్లు తీయగలిగాడు.
వివరాలు
5 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసిన కేకేఆర్
టాస్ గెలిచిన ముంబై మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా,కోల్‌కతా బ్యాటింగ్‌కు దిగింది.అయితే, కేకేఆర్ ఆటతీరు అత్యంత పేలవంగా ఉండడంతో 16.2 ఓవర్లలోనే 116 పరుగుల వద్ద ఆల్‌ఔట్ అయింది.
కేవలం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది.10 ఓవర్లు పూర్తయ్యే సరికి,5 వికెట్ల నష్టానికి కేవలం 69 పరుగులు మాత్రమే చేసింది.
కోల్‌కతా జట్టులో రఘువంశీ 26,రమన్‌దీప్ 22 పరుగులు చేయగా,మిగతా ఎవ్వరూ 20 పరుగుల మార్కును కూడా దాటలేకపోయారు.
ఒక దశలో కోల్‌కతా కనీసం 100 పరుగులు చేయగలదా? అనే సందేహం కూడా కలిగింది.
వివరాలు
అత్యంత తక్కువ స్కోర్ చేసిన జట్టుగా కోల్‌కతా
ముంబై బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు పడగొట్టి, కేకేఆర్‌ను తీవ్రంగా దెబ్బతీశాడు.
పాండ్యా 2 వికెట్లు తీయగా, దీపక్, బౌల్ట్, విఘ్నేశ్ తలో వికెట్ తీసి జట్టును బలంగా నిలిపారు.
ఈ సీజన్‌లో అత్యంత తక్కువ స్కోర్ చేసిన జట్టుగా కోల్‌కతా నిలవడం విశేషం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆల్‌రౌండ్ ప్రదర్శన.. కోల్‌కతాపై ముంబయి విజయం
Mumbai Indians Beat Kolkata Knight Riders By 8 Wickets❤️ pic.twitter.com/GYrqMa3Wro
— Cricket Chamber (@cricketchamber) March 31, 2025