Page Loader
MI vs SRH: విజృంభించిన ముంబై పేసర్లు.. కుప్పకూలిన సన్ రైజర్స్ బ్యాటర్లు
విజృంభించిన ముంబై పేసర్లు.. కుప్పకూలిన సన్ రైజర్స్ బ్యాటర్లు

MI vs SRH: విజృంభించిన ముంబై పేసర్లు.. కుప్పకూలిన సన్ రైజర్స్ బ్యాటర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 23, 2025
08:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉప్ప‌ల్ స్టేడియంలో స‌న్‌ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టాపార్డర్ పూర్తిగా కుప్ప‌కూలింది. గత మ్యాచ్‌లో ప‌వ‌ర్ ప్లేలో రికార్డు స్థాయిలో ప‌రుగులు సాధించిన జట్టు, ఈ మ్యాచ్‌లో మాత్రం అత్యల్ప స్కోర్‌తో పరిమితమైంది. ముంబయి ఇండియ‌న్స్ పేస‌ర్ ట్రెంట్ బౌల్ట్(2 వికెట్లు - 8 పరుగులు) విజృంభించగా, స‌న్‌రైజ‌ర్స్ 14 ప‌రుగుల‌కే మూడు కీల‌క వికెట్లను కోల్పోయింది. ఆరెంజ్ ఆర్మీ పీక‌ల్లోతు క‌ష్టాల్లో చిక్కుకున్న పరిస్థితిలో, అనికేత్ వ‌ర్మ‌(2), హెన్రిచ్ క్లాసెన్(9) జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప‌వ‌ర్ ప్లే ముగిసే సమయానికి స‌న్‌రైజ‌ర్స్ స్కోర్ 24 పరుగుల వద్ద నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.

Details

14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై

ముందుగా టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, హైద‌రాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో అభిమానులు భారీ స్కోర్‌కోసం ఎదురుచూశారు. కానీ రెండో ఓవ‌ర్లోనే ఓపెనర్ ట్రావిస్ హెడ్(0)ను బౌల్ట్ డ‌కౌట్‌గా పెవిలియ‌న్‌కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిష‌న్(1) దీపక్ చాహ‌ర్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ రికెల్ట‌న్‌కు క్యాచ్ ఇచ్చాడు. బంతి గ్లోవ్స్ లేదా బ్యాట్‌కు తాకలేదని అనిపించినా, అతను రివ్యూకు కూడా వెళ్ళకుండా నేరుగా పెవిలియ‌న్ చేరాడు. అభిషేక్ శ‌ర్మ‌(8), నితీశ్ కుమార్ రెడ్డి(2)లు వరుసగా పెవిలియ‌న్‌ చేరారు. దీంతో క‌మిన్స్ నేతృత్వంలోని సన్‌రైజ‌ర్స్ 14 పరుగుల‌కే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయింది.