Padmakar Shivalkar: మాజీ క్రికెటర్.. ముంబై స్పిన్నర్ పద్మాకర్ శివల్కర్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ క్రికెటర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పద్మకర్ శివాల్కర్ (84) కన్నుమూశారు.
దేశవాళీ క్రికెట్‌లో ఆయన గొప్ప ప్రదర్శన కనబరిచినా, అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం మాత్రం దక్కలేదు.
ఇరవై ఏళ్లకు పైగా ముంబై జట్టును ప్రతినిధ్యం వహించిన ఆయన, క్రికెట్‌లో తనదైన ముద్ర వేశారు.
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆయన మృతి పట్ల స్పందిస్తూ, "భారత క్రికెట్ ఒక గొప్ప లెజెండ్‌ను కోల్పోయింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌లో పద్మకర్ శివాల్కర్‌కు అపారమైన నైపుణ్యం ఉంది. ఆటపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన, దేశవాళీ క్రికెట్‌లో అతన్ని చిరస్థాయిగా నిలిపింది" అని అన్నారు.
వివరాలు
13 సార్లు పదివికెట్ల ఘనత
శివాల్కర్ మరణ వార్తపై సునీల్ గవాస్కర్ సహా అనేకమంది మాజీ క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ముంబై క్రికెట్‌కు అనేక విజయాలు అందించిన మిలింద్ రెగెతో పాటు శివాల్కర్ కూడా కొద్ది కాలంలోనే ప్రపంచానికి దూరమవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
శివాల్కర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ 1961లో ప్రారంభమైంది.1988 సీజన్ వరకు ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించారు.
124ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 589వికెట్లు పడగొట్టి,42 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించారు.
అలాగే, 13 సార్లు పదివికెట్ల ఘనతను నమోదు చేశారు.
1972/73 రంజీ ట్రోఫీ ఫైనల్‌లో కేవలం 16 పరుగులే ఇచ్చి 8 వికెట్లు తీసిన ఘనత ఆయన సొంతం. 2016లో ఆయన సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.