Page Loader
MI vs GT: ముంబయి వర్సెస్ గుజరాత్.. నేడు ఎలిమినేటర్‌లో గెలిచేది ఎవరు?
ముంబయి వర్సెస్ గుజరాత్.. నేడు ఎలిమినేటర్‌లో గెలిచేది ఎవరు?

MI vs GT: ముంబయి వర్సెస్ గుజరాత్.. నేడు ఎలిమినేటర్‌లో గెలిచేది ఎవరు?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2025లో ఇవాళ రాత్రి మరో ఆసక్తికర సమరం జరగనుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ (GT), ముంబయి ఇండియన్స్‌ (MI) తలపడనున్నాయి. ఈ హోరాహోరీ పోరు ముల్లాన్‌పుర్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌తో పోటీపడుతుంది. ఓడిన జట్టు ఐపీఎల్‌ 2025 నుంచి నిష్క్రమిస్తుంది. ఐపీఎల్ ప్రారంభ దశలో అద్భుతంగా ఆడిన గుజరాత్ టైటాన్స్, చివరి రెండు మ్యాచ్‌లలో వరుస ఓటములతో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి జారిపోయింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 5 ఓటములు మూలంగా 18 పాయింట్లు సాధించింది.

Details

జోస్ బట్లర్ దూరం

శుభ్‌మన్‌ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్‌లు వరుసగా మంచి పరుగులు సాధించారు. అయితే జోస్ బట్లర్‌ జాతీయ జట్టు ఆహ్వానం వల్ల స్వదేశానికి వెళ్లిపోవడం గుజరాత్‌కు నష్టంగా మారింది. ప్రస్తుతానికి గిల్, సుదర్శన్ పైనే బాట ఉంది. రూథర్‌ఫోర్డ్, షారుక్‌ ఖాన్‌, రాహుల్ తెవాటియా కీలకంగా నిలవాల్సిన సమయం ఇది. బౌలింగ్‌లో సిరాజ్ వికెట్లు పడగొట్టడం పాజిటివ్. అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది.

Details

నాలుగో స్థానంలో ముంబయి ఇండియన్స్

సీజన్‌ ఆరంభంలో పేలవంగా ఆడిన ముంబయి ఇండియన్స్, మళ్లీ పోటీకి గట్టిగా తిరిగొచ్చింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 6 ఓటములు మూలంగా 16 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. విదేశీ ఆటగాళ్లు రికిల్‌టన్‌, విల్ జాక్స్‌లు తమ దేశాలకు వెళ్లిపోయారు. దాంతో రోహిత్ శర్మతో కలిసి జానీ బెయిర్‌స్టో ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. సూర్యకుమార్ యాదవ్ ఫాంటాస్టిక్ ఫామ్‌లో ఉండటం ముంబైకు పెద్ద ప్లస్. హార్దిక్ పాండ్య, తిలక్ వర్మలు కలిస్తే ముంబై బ్యాటింగ్ మరింత బలపడుతుంది.

Details

బౌలింగ్ విభాగంలో ముంబైకు మెరుగైన ఆధిక్యం

బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, అశ్విని కుమార్, దీపక్ చహర్, హార్దిక్ పాండ్య, మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో ముంబైకు గొప్ప బలం అందిస్తున్నారు. గుజరాత్ స్టార్స్ ఉన్నా, ముంబై బౌలింగ్ విభాగం మ్యాచ్‌ను ఏ దిశగా నడిపించగలదో చెప్పలేము. ఈ కీలక పోరును స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.