LOADING...
NBK111: మ్యూజిక్ వర్క్ ప్రారంభం.. థమన్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో ఉత్సాహం
మ్యూజిక్ వర్క్ ప్రారంభం.. థమన్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో ఉత్సాహం

NBK111: మ్యూజిక్ వర్క్ ప్రారంభం.. థమన్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో ఉత్సాహం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2025
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ అభిమానుల దృష్టి ఇప్పుడు 'అఖండ-2' కొత్త విడుదల తేదీపై ఉన్నప్పటికీ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న NBK111 ప్రాజెక్ట్‌పై వచ్చే వరుస అప్‌డేట్‌లు ఫ్యాన్స్‌ను మరింత ఉత్సాహపరుస్తున్నాయి. ఇప్పటికే సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరాయి, త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చిన చిన్న అప్‌డేట్‌ ఇప్పుడు అభిమానుల్లో భారీ హైప్‌ క్రియేట్ చేసింది. థమన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో NBK111 మ్యూజిక్ వర్క్ ప్రారంభమైందని ప్రకటించగానే, ఆ పోస్ట్ తక్షణమే వైరల్ అయింది. బాలకృష్ణ పవర్‌ఫుల్ ఎలివేషన్లకు థమన్ అందించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) 'అఖండ', 'వీర సింహా రెడ్డి'లో ఇచ్చిన సూపర్‌ ఇఫెక్ట్‌ను గుర్తుచేస్తుంది.

Details

భారీ పీరియడ్ డ్రామాగా మూవీ

ఈ కాంబినేషన్ తిరిగి NBK111లో మొదలైందని తెలిసిన ఫ్యాన్స్, థమన్ బాదుడు అంటూ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. NBK111 సినిమా భారీ పీరియడ్ డ్రామాగా రూపొందుతోందని సమాచారం. ఇందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో (ద్విపాత్రాభినయం) కనిపించనున్నారు. మాస్ కమర్షియల్ చిత్రాలకు ప్రత్యేకమైన కేరాఫ్ ఉన్న గోపీచంద్ మలినేని, పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో బాలయ్యను ఎలా చూపిస్తారన్నది అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా బాలకృష్ణకు జోడీగా సీనియర్ నటి నయనతారను మళ్లీ ఎంపిక చేయడం ప్రాజెక్ట్‌కు మరింత హైప్ ఇచ్చింది. వృద్ధి సినిమాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న NBK111 షూటింగ్ మొదలైన తర్వాత, సినిమాలోని పాత్రలు, లుక్స్ ఇతర విశేషాలు త్వరలో అభిమానులకి లభించనున్నాయి.

Advertisement