Virat Kohli: నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి.. ఇదే నా నినాదం: విరాట్ కోహ్లీ
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డే వరల్డ్ కప్ 2023లో అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. ఒక పాకిస్థాన్ తో మ్యాచ్ మినహా మిగతా నాలుగు మ్యాచుల్లోనూ కోహ్లీ చెలరేగాడు. ఐదు మ్యాచుల్లో 118.00 సగటుతో మొత్తం 354 పరుగులు బాదేశాడు. ప్రపంచ కప్ లో ఇప్పటివరకూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటికే తన విజయరహస్యాన్ని ఇప్పటికే చాలాసార్లు వెల్లడించారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ప్రతి రోజూ కష్టపడతానని, అత్యున్నత స్థాయికి చేరుకున్నానని తాను ఎప్పుడూ భావించనని పేర్కొన్నారు.
అత్యుత్తమ స్థాయి అనేది ఎక్కడా ఉండదు
వ్యక్తిగతంగా, సామర్థ్యపరంగా మరింత మెరుగ్గయ్యేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటానని, దాని కోసం నిరంతరం శ్రమిస్తానని కోహ్లీ పేర్కొన్నాడు. అత్యుత్తమ స్థాయి అనేది ఎక్కడా ఉండనది, దానికి హద్దు ఉండదనేది తన నమ్మకమని, నిలకడగా ప్రదర్శన ఇవ్వాలంటే నిరంతరం శ్రమిస్తూనే ఉండాలన్నారు. తన నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఏం చేయాలనేదానిపై మాత్రమే సాధన చేస్తానని, అంతిమ లక్ష్యం జట్టు విజయం కోసం ప్రయత్నిస్తానని విరాట్ కోహ్లీ వెల్లడించారు. ఇక అక్టోబర్ 29న ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది.