Page Loader
Jasprit Bumrah: 'నా మొగుడు గ్రేట్ బౌలర్'.. బుమ్రాపై సంజనా స్పెషల్ పోస్ట్
'నా మొగుడు గ్రేట్ బౌలర్'.. బుమ్రాపై సంజనా స్పెషల్ పోస్ట్

Jasprit Bumrah: 'నా మొగుడు గ్రేట్ బౌలర్'.. బుమ్రాపై సంజనా స్పెషల్ పోస్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2024
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ స్టాండ్ ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు ఊరట లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి బుమ్రా 10 ఓవర్ల బౌలింగ్ చేసి కేవలం 17 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాథన్ మెక్‌స్వీ, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖావాజా, కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌పై అతని సతీమణి సంజన గణేషన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Details

టీమిండియా 150 పరుగులకు ఆలౌట్

బుమ్రా ఫొటోను షేర్ చేస్తూ 'గ్రేట్ బౌలర్, ఈవెన్ గ్రేటర్ బ్యూటీ' అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. తన భర్త గొప్ప బౌలర్ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఫ్యాన్స్, క్రికెట్ కామెంటేటర్స్, మాజీ క్రికెటర్లు కూడా బుమ్రా ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.4 ఓవర్లలో కేవలం 150 పరుగులకే ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి (41), రిషబ్ పంత్ (37) కీలక ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 94 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది.