LOADING...
BCCI:నా రాజీనామాకు జై షాతో సంబంధం లేదు.. శివరామకృష్ణన్ క్లారిటీ!
నా రాజీనామాకు జై షాతో సంబంధం లేదు.. శివరామకృష్ణన్ క్లారిటీ!

BCCI:నా రాజీనామాకు జై షాతో సంబంధం లేదు.. శివరామకృష్ణన్ క్లారిటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 21, 2026
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

నన్ను బీసీసీఐ గత 23 ఏళ్లుగా విస్మరిస్తోంది. అందుకే కామెంటేటర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అతడిని పక్కనపెట్టడంలో బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా పాత్ర ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా శివరామకృష్ణన్ మరోసారి స్పందిస్తూ ఈ ఆరోపణలను ఖండించారు. తన రాజీనామా విషయాన్ని బీసీసీఐ ఉన్నతాధికారులతో అనుసంధానం చేయవద్దని స్పష్టం చేశారు. ఇది బీసీసీఐలోని ఒకే ఒక్క ఉద్యోగి తీసుకున్న నిర్ణయం వల్లే జరిగింది. జై షాతో పాటు ఇతర ఉన్నతాధికారులకు ఇందులో ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు.

Details

23 ఏళ్ల పాటు సేవలు

అదేవిధంగా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే హక్కు నాకు ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. శివరామకృష్ణన్ 2000 సంవత్సరం నుంచి కామెంటేటర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఐసీసీ క్రికెట్ కమిటీలో కూడా సభ్యుడిగా సేవలందించారు. అయినప్పటికీ, టాస్ కార్యక్రమాలు, అవార్డు ప్రజెంటేషన్లలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే కారణంగా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. బీసీసీఐ తనను గత 23 ఏళ్లుగా నిర్లక్ష్యం చేసిందని చేసిన ఆరోపణలు పెద్ద చర్చకు దారితీశాయి. తాజా వివరణతో వివాదానికి కొంత ముగింపు పలికినప్పటికీ, ఇకపై ఆయన క్రికెట్ రంగంలో ఏ విధంగా కొనసాగుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement