సౌదీ అరేబియా క్లబ్‌లో చేరిన ఎన్'గోలో కాంటే.. ధ్రువీకరించిన చెల్సియా
ఈ వార్తాకథనం ఏంటి
చెల్సియా మిడ్‌ఫీల్డర్ ఎన్ గోలో కాంటే సౌదీ ఆరేబియా క్లబ్ అల్ ఇత్తిహాద్‌లో చేరాడు. 2016లో లిసెస్టర్ నుండి చెల్సియాలో అతను చేరాడు.
చెల్సియా ఒప్పందం ముగియడంతో సౌదీ ఆరేబియా క్లబ్ అల్ ఇత్తిహాద్ లో చేరినట్లు చెల్సియా ధ్రువీకరించింది.
సౌదీ జట్టుతో మూడేళ్ల ఒప్పందంపై అతను సంతకం చేశాడు. ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలవడానికి లీసెస్టర్ సిటీకి సాయం చేసిన ఫుట్ బాల్ ప్లేయర్ కాంటే 2016లో చెల్సియాలో చేరాడు.
ఏడేళ్ల కాలంలో ప్రీమియర్ లీగ్, FA కప్, UEFA ఛాంపియన్స్‌లీగ్, UEFA యూరోపా లీగ్, UEFA సూపర్‌కప్, FIFA క్లబ్ ప్రపంచ కప్‌లను గెలిపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. దేశీయ కప్ పోటీలలో చెల్సియా ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచింది.
Details
కాంటే సాధించిన రికార్డులివే
కాంటే తన కెరీర్‌ను బౌలోగ్నేతో ప్రారంభించాడు. ఇందులో 40 ప్రదర్శనలు చేసి నాలుగు గోల్స్ చేశాడు. అదే విధంగా లీసెస్టర్‌లో ఒక సీజన్ ఆడాడు. కాంటే చెల్సియా తరపున 269 మ్యాచులు ఆడాడు.
227 ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లలో కాంటే 12 గోల్స్ చేశాడు. ఇందులో 17 అసిస్ట్‌లు చేశాడు. అతని 155 షాట్లలో 42సార్లు లక్ష్యాన్ని సాధించాడు. కాంటే 36 బ్లాక్‌లు, 507 ఇంటర్‌సెప్షన్‌లు, 428 విజయవంతమైన ట్యాకిల్స్, 217 క్లియరెన్స్‌లను కూడా చేశాడు.
కాంటే 2016-17లో PFA ప్లేయర్స్ ఆఫ్ ది ఇయర్, ప్రీమియర్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, FWA ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.