ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్ననాదల్.. కెరీర్ గురించి కీలక ప్రకటన
తుంటిగాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్నట్లు రాఫెల్ నాదల్ ప్రకటించాడు. ముఖ్యంగా తన కెరీర్ లో 2024 చివరి సీజన్ కావొచ్చని అభిప్రాయపడ్డాడు. గాయాలు ఇంకా వెంటాడుతుండడంతో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓఫెన్ లో బరిలోకి దిగడం లేదని స్పష్టం చేశాడు. ఫూర్తి స్థాయి ఫిటెనెస్ లేకపోవడం వల్ల ఫ్రెంచ్ ఓపెన్ ఆడడం తనకు సాధ్యం కాదని వెల్లడించారు. గురువారం మలోర్కాలోని తన టెన్నిస్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాదల్ కీలక విషయాలను తెలియజేశారు. జనవరి 18న ఆస్ట్రేలియా ఓపెన్ రెండో రౌండ్లో ఓడిపోయిన తర్వాత నాదల్ మళ్లీ బరిలోకి దిగలేదు. గతేడాది 36ఏళ్ల వయస్సులో నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకున్న విషయం తెలిసిందే.
ఫ్రెంచ్ ఓపెన్ కు ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ దూరం
14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను సాధించిన నాదల్.. ఆ టోర్నికి దూరం కావడం ఇదే తొలిసారి. 2005 అరంగేట్రం చేసిన తర్వాత మొదటిసారిగా నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ కు దూరమవుతున్నాడు. తన కెరీర్ లో ఫ్రెంచ్ ఓపెన్ చాలా ప్రత్యేకమైందని, రొలాండ్ గారొస్ లో ఇప్పటికే 14 టైటిల్స్ సాధించడం చాలా గర్వంగా ఉందని వివరించారు. ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ డ్రా ఈ నెల 28న మొదలవుతుంది. అదే విధంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ తప్పుకున్నాడు. కాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఈ టోర్నికి దూరమయ్యాడు.