Page Loader
అహ్మదాబాద్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌ను వీక్షించనున్న నరేంద్రమోడీ
ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టును వీక్షించనున్న ప్రధాని

అహ్మదాబాద్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌ను వీక్షించనున్న నరేంద్రమోడీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2023
09:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9న టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. నాలుగో టెస్టు మ్యాచ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ చివరి మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా భారత్‌కు రానున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ టెస్టు మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత గడ్డప అడుగుపెట్టిన ఆసీస్ జట్టు.. బెంగుళూరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్ లో బీజీబీజీగా గడుపుతోంది. అదే విధంగా రోహిత్ సారథ్యంలోని భారత జట్టు కూడా శుక్రవారం నుంచి తమ ప్రాక్టీస్ ను ప్రారంభించింది.

టీమిండియా

భారత్ 2-0తో విజయం సాధిస్తే మెరుగైన అవకాశం

ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఆతిథ్య జట్టు భారత్ కనీసం 2-0తో విజయం సాధించాలి.బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత పర్యటన ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ప్రారంభమవుతుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లతో కూడిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కూడా ఈ సీజన్‌తో ముగియనుంది. ఫిబ్రవరి 9- 13: నాగ్‌పూర్‌ 2. ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ 3. మార్చి 1-5: ధర్మశాల 4. మార్చి 9- 13: అహ్మదాబాద్‌