Asia Cup 2023: చరిత్రలో తొలిసారిగా ఆసియాకప్‌కు అర్హత సాధించిన నేపాల్.. కెప్టెన్‌గా రోహిత్ పాడెల్!
పసికూన నేపాల్ జట్టు చరిత్రలో తొలిసారి ఆసియాకప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ 2023 ఫైనల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుపై నేపాల్ విజయం సాధించింది. దీంతో నేరుగా ఆసియాకప్‌కు అర్హత సాధించింది. భారత్, పాకిస్థాన్ ఉన్న గ్రూప్-ఏలో నేపాల్ చోటు దక్కించుకోవడం విశేషం. ఈ మెగా టోర్నీకి 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నేపాల్ క్రికెట్ ఇటీవలే ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ రోహిత్ పాడెల్ వ్యవహరిస్తుండగా, సందీప్ లామిచానే, కుశాల్ మల్లా వంటి స్టార్ ప్లేయర్లతో ఆ జట్టు పటిష్టంగా ఉంది. ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన ఎమర్జింగ్ ఆసియాకప్‌లో నేపాల్ జట్టు చెత్త ప్రదర్శనతో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఆగస్టు 30న పాకిస్థాన్ తో తలపడనున్న నేపాల్
ఇక ఆసియా కప్ 2023లో నేపాల్ జట్టు ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా పాకిస్థాన్ తో తలపడనుంది. ఆసియా కప్ 2023కు నేపాల్ జట్టు రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, కుసల్ భుర్టెల్, లలిత్ రాజ్‌బన్షి, భీమ్ షర్కీ, కుశాల్ మల్లా, డి.ఎస్. ఐరీ, సందీప్ లామిచానే, కరణ్ కె.సి., గుల్షన్ ఝా, ఆరిఫ్ షేక్, సోంపాల్ కమీ, కె. ప్రతీస్ జి.సి. మహతో, సందీప్ జోరా, అర్జున్ సౌద్, శ్యామ్ ధాకల్