Page Loader
ODI World Cup: వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. సఫారీలకు షాకిచ్చిన నెదర్లాండ్స్ 
వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. సఫారీలకు షాకిచ్చిన నెదర్లాండ్స్

ODI World Cup: వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. సఫారీలకు షాకిచ్చిన నెదర్లాండ్స్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 17, 2023
11:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్‌ 2023 లో మరో సంచలనం నమోదైంది. నిన్న ఆఫ్గాన్‌పై ఇంగ్లండ్ గెలవగా, తాజాగా దక్షిణాఫ్రికాకు పసికూన నెదర్లాండ్స్ షాకిచ్చింది. 246 పరుగుల లక్ష్య చేధనలో ప్రోటిస్ బ్యాటర్లు తేలిపోయారు. డచ్ బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా 207 పరుగులకే ఆలౌటైంది. దీంతో నెదర్లాండ్స్ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లోగాన్ వాన్ బీక్ 3 వికెట్లతో చెలరేగగా, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, బాస్ డి లీడే తలా రెండు వికెట్లు పడగొట్టి సఫారీల నడ్డి విరిచాడు. సఫారీ జట్టులో మిల్లర్ 43, మహరాజ్ 40 రన్స్‌తో ఫర్వాలేదనిపించగా, మిగతా ప్లేయర్లు నిరాశపరిచారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

38 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ విజయం