Page Loader
IND vs NZ: న్యూజిలాండ్ 255 పరుగులకే ఆలౌట్.. భారత్ లక్ష్యం 359 పరుగులు
న్యూజిలాండ్ 255 పరుగులకే ఆలౌట్.. భారత్ లక్ష్యం 359 పరుగులు

IND vs NZ: న్యూజిలాండ్ 255 పరుగులకే ఆలౌట్.. భారత్ లక్ష్యం 359 పరుగులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2024
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ముందు న్యూజిలాండ్‌ 359 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. ఇందులో టామ్ లేథమ్‌ 86, గ్లెన్ ఫిలిప్స్‌ 48*, టామ్ బ్లండెల్‌ 41 రన్స్‌ తో ఫర్వాలేదనిపించారు. ఈ ఇన్నింగ్స్ లో పది వికెట్లు స్పిన్నర్లే తీయడం గమనార్హం. భారత బౌలర్లలో సుందర్‌ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్‌ 2 వికెట్లు తీసుకున్నారు. స్పిన్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం టీమిండియాకు సవాలుగా మారింది. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 259 పరుగులు సాధించగా, భారత్‌ 156 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.