Page Loader
టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన, ఆలౌరౌండర్ రీ ఎంట్రీ
టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్న జేమీషన్

టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన, ఆలౌరౌండర్ రీ ఎంట్రీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2023
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో ఫిబ్రవరి 16న స్వదేశంలో న్యూజిలాండ్ రెండు టెస్టులను ఆడనుంది. ఇందుకోసం 14మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ ప్రకటించింది. టిమ్ సౌతీ న్యూజిలాండ్ టెస్టుకు సారథిగా నియమితులయ్యారు. ఆల్ రౌండర్ కైల్ జేమీసన్ ఆరు నెలల తర్వాత జాతీయ జట్టులో తిరిగి స్థానం సంపాదించుకున్నాడు. గతేడాది జూన్‌లో ఇంగ్లండ్‌ పర్యటనలో జేమీసన్‌ వెన్నులో గాయమైంది. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. లెగ్ స్పిన్నర్ ఇష్ సోధి పాకిస్థాన్ సిరీస్‌లో ఆకట్టుకోవడంతో తిరిగి జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

న్యూజిలాండ్

న్యూజిలాండ్ టెస్టు జట్టులోని సభ్యులు

పాకిస్థాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టిన సోధీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆల్ రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ జట్టులో రెండో స్పిన్నర్ గా ఎంపికయ్యాడు కేన్ విలియమ్సన్‌ను టెస్ట్ కెప్టెన్‌గా తప్పించిన తర్వాత సొంతగడ్డపై తొలిసారిగా టిమ్ సౌతీ జట్టుకు నాయకత్వ బాధ్యతను వహించనున్నాడు ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరిగే తొలి టెస్టు బే ఓవల్‌లో డే-నైట్‌గా మ్యాచ్‌గా జరగనుంది. న్యూజిలాండ్ టెస్ట్ జట్టు: టిమ్ సౌతీ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, ఇష్‌సోధి, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, నీల్ వాగ్నెర్ విలియమ్సన్, విల్‌యంగ్