న్యూజిలాండ్ స్టార్ పేసర్ సంచలనం.. మెయిన్ అలీ బాటలోనే!
న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 కోసం న్యూజిలాండ్ జట్టులో చేరేందుకు ఓకే చెప్పాడు. గతేడాది ఆగస్టులో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్టు వదులుకున్న బౌల్ట్.. బోర్డు కోరిక మేరకు మళ్లీ న్యూజిలాండ్ తరుపున బరిలో దిగేందుకు అంగీకరించాడు. ఇప్పటికే ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకోగా తాజాగా న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కూడా జాతీయ జట్టు తరుపున ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బిగ్ బాష్ లీగ్ లో ఆడేందుకు సెంట్రల్ కాంట్రాక్టును వదులుకున్న బౌల్ట్ ప్రస్తుతం టీ20 లీగుల్లో మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే.
వన్డే వరల్డ్ కప్ లలో బౌల్ట్ అద్భుత ప్రదర్శన
ఇప్పటికే ఈ విషయంపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బౌల్ట్ తో సంప్రదింపులు చేసింది. అయితే సెంట్రల్ డీల్ పొందిన ఆటగాళ్ల జాబితాలో అతను లేనప్పటికీ ' సాధారణ ప్లేయింగ్ అగ్రిమెంట్' చేసుకున్నట్లు కీవీస్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికీ బౌల్ట్ అత్యుత్తమ వన్డే బౌలర్ అనడంలో సందేహం లేదు. బౌల్ట్ వన్డే వరల్డ్ కప్ లలో 21.79 సగటుతో 39 వికెట్లను పడగొట్టాడు. ఆ దేశం తరుపున మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా అతను రికార్డుకెక్కాడు. బౌల్ట్ కచ్చితంగా జట్టులో భాగమవుతాయని, లీగ్‌లతో కమిట్‌మెంట్ నేపథ్యంలో మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపాడు.