
ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన! స్టార్ బౌలర్ రీఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు 4 టీ20లు, 4 వన్డేలను ఆడనుంది. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ జట్టును ప్రకటించింది.
ఈ రెండు సిరీస్‌లకు వేర్వేరు జట్లను న్యూజిలాండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఇంగ్లండ్ పర్యటనకు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు.
ఇంగ్లండ్‌తో వన్డేలకు కెప్టెన్‌గా టామ్ లాథమ్, టీ20లకు ఫాస్ట్ బౌలర్ టీమ్ సౌథీ నాయకత్వం వ్యవహరించనున్నాడు. గతేడాది బ్లాక్ క్యాప్స్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్న స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ మళ్లీ జట్టులో చోటు సంపాదించుకున్నాడు.
ఇక స్టార్ ఆల్ రౌండర్ బ్రెస్‌వేల్ గాయం కారణంగా ఈ సిరీస్‌లకు దూరమయ్యాడు.
Details
ఇంగ్లండ్ తో తలపడే న్యూజిలాండ్ జట్టు ఇదే
ఇంగ్లండ్‌తో టీ20లకు కివీస్ జట్టు
టిమ్ సౌథీ (సి), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ రవీంద్ర సీఫెర్ట్, ఇష్ సోధి
ఇంగ్లండ్‌తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టు
టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, విల్ యంగ్
Details
ఇంగ్లండ్ పర్యటనకు ముందు యూఏఈకు వెళ్లనున్న న్యూజిలాండ్
న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ పర్యటకు ముందు యూఏఈకు వెళ్లనుంది. ఆగస్టు 17న ఇంగ్లండ్, యూఏఈ మధ్య మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది.
యూఏఈతో టీ20లకు న్యూజిలాండ్ జట్టు
టిమ్ సౌథీ (కెప్టెన్), ఆది అశోక్, చాడ్ బోవ్స్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్, లాకీ ఫెర్గూసన్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, కైల్ జామీసన్, కోల్ మెక్‌కాంచీ, జిమ్మీ నీషమ్, రచిన్ సె రవీంద్ర, మిచెల్ సీ రవీంద్ర, మిచెల్ సీ రవీంద్ర షిప్లీ, విల్ యంగ్