Page Loader
Finn Allen: 16 సిక్స్‌లతో టీ20 రికార్డును బద్దలు కొట్టిన న్యూజిలాండ్ బ్యాటర్ 
Finn Allen: 16 సిక్స్‌లతో టీ20 రికార్డును బద్దలు కొట్టిన న్యూజిలాండ్ బ్యాటర్

Finn Allen: 16 సిక్స్‌లతో టీ20 రికార్డును బద్దలు కొట్టిన న్యూజిలాండ్ బ్యాటర్ 

వ్రాసిన వారు Stalin
Jan 17, 2024
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ 62బంతుల్లో 137పరుగులు చేసి పలు రికార్డులను నెలకొల్పాడు. బుధవారం డునెడిన్‌లో న్యూజిలాండ్-పాకిస్థాన్‌ మధ్య మూడో టీ20 మ్యాచ్‌ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ పాకిస్థాన్‌కు 225పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ తన బ్యాటింగ్‌తో సునామీని సృష్టించాడు. అలెన్ బ్రెండన్ మెకల్లమ్‌ను అధిగమించి న్యూజిలాండ్ తరఫున పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఇది మాత్రమే కాదు, అతను అఫ్గానిస్థాన్‌కు చెందిన హజ్రతుల్లా జజాయ్ (ఒక ఇన్నింగ్స్‌లో 16 సిక్సర్లు) ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు. పాకిస్థాన్ స్టార్ బౌలర్ హరీస్ రౌఫ్‌ బౌలింగ్‌లో ఒక ఓవర్లో ఏకంగా అలెన్ ఏకంగా 27 పరుగులు బాదడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఒకే ఓవర్‌లో 27 పరుగులు