NZ Vs SA : టాస్ గెలిచిన న్యూజిలాండ్.. బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికా ..!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పూణే వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్, బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్లు పట్టికలో ఇరు జట్లు 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ జట్టు గెలిస్తే అది సెమీ ఫైనల్ కు మరింత చేరువ అవుతుంది. ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య 71 వన్డేలు జరిగాయి.ఇందులో న్యూజిలాండ్ 25, దక్షిణాఫ్రికా 41 విజయాలను సాధించింది. ఈ మ్యాచుకు కూడా కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. న్యూజిలాండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడ్డ లూకీ ఫెర్గ్యూసన్ స్థానంలో టిమ్ సౌతీ జట్టులోకి వచ్చాడు. మరోవైపు సౌతాఫ్రికా జట్టు కూడా ఒక మార్పు చేసింది.
ఇరు జట్లలోని సభ్యులు వీరే
దక్షిణాఫ్రికా క్వింటన్ డి కాక్(w), టెంబా బావుమా(సి), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి న్యూజిలాండ్ డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w/c), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్