LOADING...
టీమిండియాపై అరుదైన ఘనత సాధించిన నికోలస్ పూరన్
40 బంతుల్లో 67 పరుగులు చేసిన నికోలస్ పూరన్

టీమిండియాపై అరుదైన ఘనత సాధించిన నికోలస్ పూరన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 07, 2023
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన రెండోవ టీ20ల్లో భారత్‌పై వెస్టిండీస్ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచులో విండీస్ మిడిలార్డర్ కుప్పకూలినప్పటికీ నికోలస్ పూరన్ 40 బంతుల్లో 67 పరుగులు చేసి విండీస్ జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో టీమిండియాపై పూరన్ అరుదైన ఘనతను సాధించాడు. టీ20ల్లో భారత్‌పై మొదటిసారిగా పూరన్ అత్యధికంగా (67) పరుగులు చేశాడు. 2022 ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాపై పూరన్ 62 పరుగులు చేసిన విషయం తెలిసిందే. పూరన్ 2016, సెప్టెంబరు‌లో పాకిస్తాన్‌పై తన టీ20 మ్యాచును ఆడాడు.

Details

1500 పరుగుల మైలురాయిని చేరుకున్న నికోలస్ పూరన్

ఇప్పటివరకూ పూరన్ టీ20ల్లో 1500 పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలున్నాయి. దీంతో విండీస్ తరుపున ఈ మైలురాయిని అధిగమించి ఐదో బ్యాటర్ గా పూరన్ నిలిచాడు. క్రిస్ గేల్ (1,899), మార్లోన్ శామ్యూల్స్ (1,611), కీరన్ పొలార్డ్ (1,569), లెండిల్ సిమన్స్ (1,527) తర్వాత పూరన్ నిలిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తిలక్ వర్మ 41 బంతుల్లో 52 పరుగులతో చెలరేగడంతో టీమిండియా 20 ఓవర్లలో 152 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో హార్ధిక్ పాండ్యా 3, యుజేంద్ర చాహల్ రెండు వికెట్లు పడగొట్టారు.