
Nicholas Pooran: తొలి మ్యాచ్ లోనే రికార్డు.. టీ20 క్రికెట్‌లో 600 సిక్సర్ల మార్కును దాటిన పూరన్
ఈ వార్తాకథనం ఏంటి
లక్నో సూపర్‌జెయింట్స్ విధ్వంసక బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ నుంచే రికార్డు సృష్టించడం ప్రారంభించాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో 7 సిక్సర్లు బాది ఆకట్టుకున్నాడు. ఈ సిక్సర్లతో పూరన్ తన టీ20 క్రికెట్ కెరీర్‌లో 600 సిక్సర్ల మైలురాయిని అధిగమించాడు. టీ20ల్లో ఈ ఘనత సాధించిన నాల్గవ ఆటగాడిగా నిలిచాడు. ఆశ్చర్యకరంగా, పూరన్‌కు ముందు ఈ రికార్డు సాధించిన ఆటగాళ్లంతా వెస్టిండీస్ క్రికెటర్లే కావడం గమనార్హం. 'యూనివర్స్ బాస్'గా పేరుగాంచిన క్రిస్ గేల్ 1000కు పైగా సిక్సర్లు కొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
వివరాలు
టాప్-5లో ఇంగ్లాండ్ ఆటగాడు
గేల్ తన కెరీర్‌లో 455 ఇన్నింగ్స్‌ల్లో 1056 సిక్సర్లు బాదగా, పూరన్ 359వ ఇన్నింగ్స్‌లోనే 600 సిక్సర్ల మార్కును అధిగమించాడు. ఈ జాబితాలో కీరాన్ పొలార్డ్ రెండో స్థానంలో ఉండగా, ఆండ్రీ రస్సెల్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు పొలార్డ్ 908 సిక్సర్లు కొట్టగా, రస్సెల్ 733 సిక్సర్లు బాదాడు. టాప్-5లో ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ (552 సిక్సర్లు) చోటు దక్కించుకున్నాడు.
వివరాలు
టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితా:
1056 - క్రిస్ గేల్ 908 - కీరాన్ పొలార్డ్ 733 - ఆండ్రీ రస్సెల్ 606 - నికోలస్ పూరన్* 552 - అలెక్స్ హేల్స్ 550 - కాలిన్ మున్రో 529 - గ్లెన్ మాక్స్వెల్ 525 - రోహిత్ శర్మ 515 - జోస్ బట్లర్ 502 - డేవిడ్ మిల్లర్
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఒకే ఓవర్లో 4 సిక్సర్లు కొట్టిన నికోలస్ పూరన్
Nicholas pooran hit 4 sixes in one over #LSGvsDC #lsgvdc pic.twitter.com/5EOzGPfCOC
— भाई साहब (@Bhai_saheb) March 24, 2025