Page Loader
Nitish Kumar Reddy : తిరుమలలో నితీష్ కుమార్.. మోకాళ్లతో మెట్లెక్కి స్వామి దర్శనం
తిరుమలలో నితీష్ కుమార్.. మోకాళ్లతో మెట్లెక్కి స్వామి దర్శనం

Nitish Kumar Reddy : తిరుమలలో నితీష్ కుమార్.. మోకాళ్లతో మెట్లెక్కి స్వామి దర్శనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 14, 2025
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. గత ఆదివారం 70,966 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ. 2.95 కోట్ల ఆదాయం సమకూరింది. తాజాగా టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన, మోకాళ్ల పర్వతం వద్ద మోకాళ్లతో మెట్లను ఎక్కి భక్తితో స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

Details

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆకట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డి

ఇటీవల ఆస్ట్రేలియాలో ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి ఆకట్టుకున్నాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లకు ధీటుగా నిలిచి, తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. ఆ సెంచరీలో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో వంద పరుగులు సాధించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి భారీ స్కోర్ సాధించి, చరిత్రలో నిలిచాడు. నితీష్ ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. జనవరి 22న మొదటి టీ20 మ్యాచ్ జరుగనుండగా, మొత్తం ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఉండనున్నాయి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ఆయన తిరుమలకు వచ్చారు.