రూ.18 కోట్లతో అనుభవం రాదు.. కర్రన్ పై సెహ్వాగ్ ఫైర్
2023 మినీ వేలంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా సామ్ కర్రన్ నిలిచిన విషయం తెలిసిందే. అతనిపై పంజాబ్ కింగ్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని రూ.18 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. కానీ ఇప్పటివరకూ అతడు ఆ స్థాయికి తగ్గట్లు ఆడకపోవడంతో అతనిపై విమర్శలు ఎక్కువయ్యాయి. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కరన్ ఒక వికెట్ కూడా తీయలేదు. అటు బ్యాటింగ్ లోనూ 10 పరుగులకు వెనుతిరిగాడు. శిఖర్ ధావన్ విరామం తీసుకోవడంతో శామ్ కర్రన్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ క్రమంలో ప్రముఖ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ శామ్ కర్రన్ ఆటతీరుపై విమర్శలు కురిపించాడు.
శామ్ కర్రన్ బద్దకంతో ఔట్ అయ్యాడు
ఆర్సీబీ విధించిన 175 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో పంజాబ్ 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే పదో ఓవర్ లో శామ్ కర్రన్ బద్దకంగా పరిగెత్తి రనౌట్ అయ్యాడు. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ సీరియస్ అయ్యాడు. శామ్ కర్రన్ అంతర్జాతీయ ఆటగాడు అని, రూ.18 కోట్లతో అనుభవాన్ని ఎవరూ కొనుగోలు చేయలేరని, ఆడినప్పుడు అనుభవం వస్తుందని సెహ్వాగ్ తెలిపారు. ఆర్సీబీ చేతిలో పంజాబ్ ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ఐదో స్థానానికి దిగజారింది