IND vs ENG 2nd Test: శుభ్‌మన్ గిల్‌కు గాయం.. సర్ఫరాజ్ ఖాన్ ఎంట్రీ!
విశాఖపట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 4వ రోజు భారత బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ మైదానంలోకి రాలేడని బీసీసీఐ సోమవారం (ఫిబ్రవరి 5) తెలిపింది. 3వ రోజు అద్భుతమైన సెంచరీతో ఫామ్‌లోకి తిరిగి వచ్చిన గిల్, 2వ రోజు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతని కుడి చూపుడు వేలికి గాయమైంది.దింతో వైజాగ్ టెస్ట్ చివరి రోజున మైదానంలోకి రాలేదు. 2వ రోజు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు శుభ్‌మాన్ గిల్ కుడి చూపుడు వేలికి గాయమైంది. అతను ఈ రోజు ఫీల్డింగ్ చేయలేడని " అని BCCI విశాఖపట్నంలో రోజు ఆటకు ముందు X లో పోస్ట్ చేసింది.
గిల్‌కు ప్రత్యామ్నాయంగా సర్ఫరాజ్ ఖాన్
గాయపడిన KL రాహుల్ ప్లేస్ లో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, 4వ రోజు ఆట ప్రారంభంలో గిల్‌కు ప్రత్యామ్నాయంగా మైదానంలోకి వచ్చాడు. స్లిప్‌లో అద్భుతంగా క్యాచ్‌లు అందుకునే గిల్.. ఫీల్డింగ్‌లో లేకపోవడం భారత్‌కు ఎదురుదెబ్బే అని చెప్పాలి. గిల్ మూడో స్థానానికి చేరుకున్నప్పటి నుండి పరుగుల కోసం చాలా కష్టపడ్డాడు. కానీ రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో మూడవ టెస్ట్ సెంచరీతో విమర్శకుల నోరు మూయించాడు. ఆతిథ్య జట్టు మొదటి టెస్ట్ మ్యాచ్ ఓటమి తర్వాత సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. గిల్ 11 ఫోర్లు,2 సిక్సర్లతో 104 పరుగులు చేయడంతో భారత్ 398 పరుగుల ఆధిక్యంలోకి చేరుకుంది. టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.