Dunit Vellalaghe: బౌలింగ్‌లోనే కాదు.. బ్యాటింగ్‌లో కూడా ఇరగదీశాడు! ఎవరీ దునిత్ వెల్లలగే?
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ సూపర్-4 మ్యాచులో 20 ఏళ్ల శ్రీలంక కుర్రాడు దునిత్ వెల్లలాగే భారత జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు.
రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలను తక్కువ స్కోరుకే ఔట్ చేశాడు. అదే విధంగా బ్యాటింగ్ లోనూ మెరిశాడు.
ఈ నేపథ్యంలో శ్రీలంక టీమిండియాను కుప్పకూల్చిందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డొమినిక్ కార్క్ పేర్కొన్నారు.
మ్యాచు చూసిన ప్రతి క్రికెట్ అభిమాని ఇలాగూ ఫీలై ఉంటారని ఆయన పేర్కొన్నారు.
దునిత్ వెల్లలాగే జనవరి 9న కొలంబోలో జన్నించాడు. గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
Details
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ జట్టులో స్టాండ్ బైగా దునిత్ వెల్లలాగే
ఇక ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ లతో జరిగిన మ్యాచులో ఐదు వికెట్ల తీసిన దునిత్ వెల్లలాగే, ప్రస్తుతం ప్రపంచ కప్ టాప్ పెర్ఫార్మర్స్‌లో ఒకడిగా నిలిచాడు.
అదేవిధంగా శ్రీలంక తరుపున 264 పరుగులు చేసి టాప్ స్కోరర్ గానూ అతను నిలిచాడు.
గతంలో సౌతాఫ్రికా జరిగిన మ్యాచులో కూడా 130 బంతుల్లో 113 పరుగులు చేసి సత్తా చాటాడు.
ఇక టీమిండియాపై ఐదు వికెట్లు పడగొట్టి లంక తరుఫున ఐదు వికెట్లు సాధించిన అతి పిన్న వయస్కుడిగా వెల్లలాగే రికార్డుకెక్కాడు.
శ్రీలంక వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ జట్టులో స్టాండ్ బైగా దునిత్ వెల్లలాగే చోటు సంపాదించాడు.