
Digvesh Rathi: మళ్లీ నోటుబుక్ సెలబ్రేషన్స్.. ఈసారి దిగ్వేశ్ ప్లాన్ ఏంటీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ రాఠీ మరోసారి వార్తల్లో నిలిచాడు.
ఇప్పటికే రెండుసార్లు జరిమానా విధించుకున్న ఈ యువ బౌలర్, తాజా మ్యాచ్‌లో మరో వివాదాస్పద సంబరంతో మూడోసారి జరిమానాకు గురవుతాడనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ఔట్ చేసిన అనంతరం, తనదైన స్టైల్లో 'నోట్‌బుక్ సెలబ్రేషన్' చేస్తూ తన సంబరాలతో మరోసారి విమర్శలకు లోనయ్యాడు.
దీని వల్ల ఐపీఎల్ కోడ్ ఆఫ్ కన్డక్ట్ ఉల్లంఘనకు సంబంధించి అతనిపై చర్యలు తీసుకోవడం ఖాయమని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు లక్నో జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ మ్యాచ్‌పై స్పందించాడు.
Details
మూడు మ్యాచుల్లో విజయం సాధించే అవకాశం
మేము తొలి ఇన్నింగ్స్‌లోనే ఎక్కువ పరుగులు ఇచ్చేశాం. ముఖ్యమైన క్యాచ్‌లు పడిపోవడంతో ప్రత్యర్థికి మెరుగైన స్కోరు చేసే అవకాశం దక్కింది.
అయితే, మిగిలిన మూడు మ్యాచుల్లో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. టాప్ ఆర్డర్‌లో కొంత మద్దతు లభించి ఉంటే ఛేదన సులభంగా సాగేది.
ప్రతి మ్యాచ్‌లో ఒక్కరే రాణించాలని ఆశించడం సరైంది కాదంటూ వ్యాఖ్యానించాడు. అటు కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న బ్యాట్స్‌మెన్ ఆయుష్ బదోని తన ఆటపై విశ్వాసం వ్యక్తం చేశాడు.
''నేను, సమద్ క్రీజ్‌లో ఉన్నప్పుడు గెలుపు నిశ్చయమని అనిపించింది.
Details
ఆయుష్ పోరాటం వృథా
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకు వచ్చి ఆడే అవకాశం నాకు చాలామంతు స్ఫూర్తినిస్తుంది.
పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉన్నా, ఫాస్ట్ బౌలర్లకూ సహకరించింది. మ్యాచ్ ఆడేందుకు ఇది చక్కటి పిచ్'' అని చెప్పాడు. కాగా, పంజాబ్ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్‌నవూ 199 పరుగులకే పరిమితమైంది.
ఆయుష్ 40 బంతుల్లో 74 పరుగులు చేసి పోరాటం సాగించినా, జట్టు పరాజయాన్ని తప్పించలేకపోయింది.