Novak Djokovic: యూఎస్ ఓపెన్ 2024లో సంచలనం.. నొవాక్ జకోవిచ్ మూడో రౌండ్‌లో ఔట్
యూఎస్ ఓపెన్ 2024లో మరో సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. టెన్నిస్ దిగ్గజం, సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్‌లోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. జకోవిచ్ 28వ సీడ్ అయిన ఆస్ట్రేలియాకు చెందిన అలెక్సీ పాప్రియన్ చేతిలో 6-4, 6-4, 2-6, 6-4 తేడాతో ఓడిపోయాడు. 18 ఏళ్లలో మొదటిసారి యూఎస్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు చేరకుండానే జకోవిచ్ ఇంటిదారి పట్టారు. ఆర్థర్ యాష్ స్టేడియంలో 3 గంటల 19 నిమిషాల పాటు జరిగిన హోరాహోరీ పోరులో జకోవిచ్ మొదటి రెండు సెట్లను కోల్పోయి కష్టాల్లోకి వెళ్లాడు.
కార్లోస్ అల్‌కరాజ్ ఇంటి దారి
మూడో సెట్‌లో తిరిగి రేసులోకి వచ్చినప్పటికీ, పాప్రియన్ తన జోరును కొనసాగించి, నాలుగో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకోవడం గమనార్హం. ఇదే టోర్నమెంట్‌లో, ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్‌కరాజ్ కూడా రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. 74వ ర్యాంకర్ బొటిక్ వాన్ డి జాండ్‌స్కల్ప్ చేతిలో 6-1, 6-5, 6-4 తేడాతో వరుస సెట్లలో పరాజయం పాలయ్యాడు. అల్‌కరాజ్, జకోవిచ్ ఇద్దరూ ఇంటిదారి పట్టడంతో యూఎస్ ఓపెన్‌లో కొత్త ఛాంపియన్ల కోసం మార్గం సుగమమైంది.