LOADING...
Rohit Sharma: ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్.. రోహిత్ శర్మ అరుదైన ఘనత
ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్.. రోహిత్ శర్మ అరుదైన ఘనత

Rohit Sharma: ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్.. రోహిత్ శర్మ అరుదైన ఘనత

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించారు. నేడు పెర్త్ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. భారత్ తరుపున 500 పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఐదో ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డుకెక్కాడు.

Details

ఈ అత్యున్నత జాబితాలో ఉన్న ప్లేయర్లు వీరే 

సచిన్ టెండూల్కర్ - 664 మ్యాచ్‌లు విరాట్ కోహ్లీ - 551 మ్యాచ్‌లు ఎంఎస్ ధోని - 535 మ్యాచ్‌లు రాహుల్ ద్రవిడ్ - 504 మ్యాచ్‌లు రోహిత్ శర్మ - 500 మ్యాచ్‌లు రోహిత్ శర్మ 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో డెబ్యూట్ చేశారు. ఇప్పటి వరకు 67 టెస్టులు, 274 వన్డేలు, 159 టీ20లు ఆడారు.