LOADING...
IND vs AUS: రేపు భారత్‌తో వన్డే మ్యాచ్.. ఆసీస్‌కు భారీ షాక్
రేపు భారత్‌తో వన్డే మ్యాచ్.. ఆసీస్‌కు భారీ షాక్

IND vs AUS: రేపు భారత్‌తో వన్డే మ్యాచ్.. ఆసీస్‌కు భారీ షాక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2023
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

రేపటి నుంచి ఆస్ట్రేలియా తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత జట్టు తలపడనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ మొహాలీ వేదికగా జరగనుంది. మొదటి వన్డేకు ముందు ఆసీస్‌ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్ తొలి వన్డేకు దూరమయ్యారు. ఈ విషయాన్ని ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపారు. గజ్జల నొప్పితో మిచెల్ స్టార్క్, చీలిమండ గాయంతో మాక్స్‌వెల్ బాధపడుతుండటంతో వారు తొలి వన్డేకు దూరమయ్యారని కమిన్స్ స్పష్టం చేశారు. మిగతా రెండు వన్డేలకు ఆ ఇద్దరూ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

Details

వన్డే ప్రపంచ కప్ లో స్టార్క్ కు  అద్భుత రికార్డు

మిచెల్ స్టార్క్ ఫిట్‌గా ఉన్నాడని, కానీ ముందస్తు చర్యల్లో భాగంగా తాము అతనికి విశ్రాంతినిచ్చామని, తర్వాతి మ్యాచుల్లో స్టార్క్, మాక్స్‌వెల్‌ను ఆడిస్తామని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఏడాది ఆరంభంలో భారత్ వేదికగా జరిగిన వన్డే సిరీస్ లోనూ స్టార్క్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు గత రెండు ప్రపంచ కప్ ల్లోనూ అతనే అత్యధిక వికెట్లు తీయడం గమనార్హం. వన్డే ప్రపంచ కప్‌కు మందు ఈ మూడు వన్డేల సిరీస్ ఇరుజట్లకు సన్మాహకంగా ఉపయోగపడనుంది.