West Indies Announce Squad : ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్
వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అర్హత సాధించిన వెస్టిండీస్, తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది. డిసెంబర్ 3 నుంచి జరిగే వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టును ప్రకటించింది. ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు వన్డే, టీ20 జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. విండీస్ వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా షాయ్ హోప్, వైస్ కెప్టెన్‌గా అల్జారీ జోసెఫ్ ఎంపికయ్యాడు. మాథ్యూ ఫోర్డ్ తొలిసారిగా వన్డే జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. టెస్టు జట్టులో రెగ్యులర్ ఉండే వెటరన్ వికెట్ కీపర్ షేన్ డౌరిచ్ కూడా వన్డేల్లో చోటు దక్కించుకున్నాడు. ఇక విండీస్ విధ్వంసకర బ్యాటర్లు పూరన్, హోల్డర్ ఈ సిరీస్‌కు దూరమయ్యారు.
వన్డే సిరీస్ కు ఎంపికైన ఇరు జట్లలోని ప్లేయర్లు వీరే!
వెస్టిండీస్ జట్టు షాయ్ హోప్ (సి), అల్జారీ జోసెఫ్ (విసి), అలిక్ అథనాజ్, యానిక్ కరియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, షేన్ డౌరిచ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, బ్రాండన్ కింగ్, గుడాకేష్ మోటీ, క్జోర్న్ ఆట్లీ, షెర్ఫాన్ రూథర్, షెర్ఫాన్ రూథర్ షెపర్డ్, ఒషానే థామస్. ఇంగ్లండ్ జట్టు జోస్ బట్లర్ (కెప్టెన్), జాక్ క్రాలే, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హెర్ట్లే, విల్ జాక్స్, హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్, ఓలీపోప్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, జాన్ టర్నర్, బ్రాడన్ కర్సే, రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్.