LOADING...
IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. ఆ ప్లేయర్‌కి ఛాన్స్
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. ఆ ప్లేయర్‌కి ఛాన్స్

IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. ఆ ప్లేయర్‌కి ఛాన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2026
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్‌ రిషబ్ పంత్‌కు చోటు దక్కింది. ఈ సిరీస్‌కు శుభ్‌మన్‌ గిల్‌ను కెప్టెన్‌గా నియమించగా, శ్రేయస్ అయ్యర్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అనుభవజ్ఞులైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జట్టులో కొనసాగుతున్నారు. అలాగే ఆల్‌రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాకు అవకాశం లభించింది. బౌలింగ్ విభాగంలో సిరాజ్, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, నితీశ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలను ఎంపిక చేశారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.

Details

భారత వన్డే జట్టు (న్యూజిలాండ్ సిరీస్)

శుభ్‌మన్‌ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్‌ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, నితీశ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.

Advertisement