Page Loader
Olympics : ఒలింపిక్స్‌లో పీవీ. సింధు విజయం

Olympics : ఒలింపిక్స్‌లో పీవీ. సింధు విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2024
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పివి.సింధు సత్తా చాటాంది. తన తొలి మ్యాచులోనే విజయఢంకా మోగించింది. మొదటి మ్యాచులో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణిపై సునాయాసంగా గెలుపొందింది. ఫాతిమాత్‌ నబానా అబ్దుల్ రజాక్‌పై 21-9, 21-6 తేడాను పి.వి సింధు గెలిచి భారత క్రీడాభిమానుల్లో పతక ఆశలను రేపింది. ఇలాగే విజయాలు సాధించి పతకాన్ని సాధించాలని భారత క్రీడాభిమానులు కోరుతున్నారు.

Details

బోణి కొట్టిన చైనా

ఇదిలా ఉండగా, పారిస్ ఒలింపిక్స్ ‌లో చైనా పసిడి బోణీ కొట్టింది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో చైనా మొదటి స్వర్ణాన్ని సాధించింది. చైనా ద్వయం హువాంగ్‌ యటింగ్‌, షెంగ్‌ లివాహో 16-12తో కొరియా జంట కెయు జిహ్యున్‌, పార్క్‌ హజున్‌పై గెలుపొందారు.