
Brian Lara : తన రికార్డును బ్రేక్ చేసే సత్తా గిల్‌కు మాత్రమే ఉంది : బ్రియన్ లారా
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మూడు ఫార్మాట్లో టీమిండియా ఓపెనర్‌గా శుభ్‌మాన్ గిల్(Shubman Gill) పాతుకుపోయిన విషయం తెలిసిందే.
ఇప్పటికే టెస్టు, వన్డే, టీ20ల్లో సెంచరీలు నమోదు చేసి సత్తా చాటాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు.
ఆడిన తొమ్మిది మ్యాచుల్లో నాలుగు హాఫ్ సెంచరీలు చేసి, 354 పరుగులు సాధించాడు.
ఈ క్రమంలో ఐసీసీ(ICC) వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకొని ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా(Team India)స్టార్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌పై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా(Brian Lara) పొగడ్తల వర్షం కురిపించాడు.
ప్రస్తుత జనరేషన్‌లో అత్యంత ప్రతిభ కలిగిన బ్యాటర్ గిల్ అని లారా కొనియాడారు.
Details
ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా గిల్ కు అవార్డు
తన పేరిట ఉన్న రెండు ప్రపంచ రికార్డులను గిల్ తప్పక బద్దలు కొడతాడని, భవిష్యత్తులో క్రికెట్ ప్రపంచాన్ని ఏలే సత్తా అతనికే ఉందని బ్రియన్ లారా చెప్పాడు.
ఒకవేళ గిల్ కౌంటీ క్రికెట్ ఆడితే తన 501 నాటౌట్ రికార్డును, అదే విధంగా టెస్టుల్లో తన అత్యధిక స్కోరు 400 పరుగులను గిల్ అధిగమిస్తాడని వెల్లడించారు.
భవిష్యత్తులో గిల్ కచ్చితంగా వీలైనన్నీ ఎక్కువ ఐసీసీ టోర్నమెంట్లు గెలుస్తాడని లారా ఆశాభావం వ్యక్తం చేశాడు.
టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును దక్కించుకున్నాడు.
డేవిడ్ మలాన్, మహ్మద్ సిరాజ్‌ను వెనక్కి నెట్టి సెప్టెంబర్ నెలకు ఉత్తమ ఆటగాడిగా గిల్ నిలిచిన విషయం తెలిసిందే.