'భారత్- పాక్ మ్యాచ్ జరిగితే క్రికెట్ అభిమానులే కాదు.. మేం కూడా ఎంజాయ్ చేస్తాం'
ఈ వార్తాకథనం ఏంటి
మరో మూడు రోజుల్లో ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ ప్రారంభం కానుంది. దీని కోసం టీమిండియా కఠోర ప్రాక్టీస్ చేస్తోంది. శ్రీలంక వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ క్లీన్‌స్వీప్ చేసి దూకుడు మీదుంది.
భారత్ - పాకిస్థాన్ మధ్య తొలి మ్యాచ్ సెప్టెంబర్ 2న జరగనుంది. ఈ నేపథ్యంలోనే దాయాదుల పోరుపై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇండో పాక్ క్రికెట్ మ్యాచ్ ఎల్లప్పుడూ ఆసక్తిరంగా, ఉత్కంఠగానే ఉంటుందన్నారు.
భారత్- పాక్ మ్యాచ్‌కు పోటీ తీవ్రంగానే ఉంటుందని, దీన్ని ప్రపంచమంతా ఆసక్తికరంగా తిలకిస్తుందన్నారు. క్రికెట్ అభిమానులే కాదు తాము కూడా దాయాదుల మధ్య క్రికెట్ ఎంజాయ్ చేస్తామన్నారు. ఇరు జట్లు 100శాతం గెలుపు కోసమే పోరాడతాయన్నారు.
DETAILS
బరిలోకి దిగాకే అసలైన సత్తా బయటకొస్తుంది : షాదాబ్ ఖాన్
పాక్ పేస్ బౌలింగ్‌ను విరాట్ కోహ్లీ హ్యాండిల్ చేయగలడని ఆసియా కప్‌కు జట్టును ప్రకటించాక చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నారు. టీ-20 ప్రపంచకప్ 2022లోనూ పాకిస్థాన్‌పై గెలవడంలో విరాట్ దే కీలక పాత్ర అని గుర్తు చేశాడు.
ఎవరుపైచేయి సాధిస్తారనేది మ్యాచ్‌లో తెలుస్తుందని అజిత్ వ్యాఖ్యలపై పాక్ ఆటగాడు షాదాబ్ ఖాన్ కౌంటరిచ్చారు. మా నుంచైనా, వారి నుంచైనా గెలవాలనే కోరుకుంటామని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. బరిలోకి దిగాకే అసలైన సత్తా బయటకొస్తుందన్నారు.
ఆసియా కప్ ప్రారంభానికి ముందే ఐసీసీ ర్యాంకులను ప్రకటించింది. వన్డేల్లో 118పాయింట్లతో పాక్ టాప్ ప్లేస్ సాధించింది. ఆసీస్ 119 పాయింట్లతో ఉన్నా రెండో స్థానానికే పరిమితమైంది. 113 పాయింట్లతో భారత్ మూడో ర్యాంకులో కొనసాగుతోంది.