Page Loader
ఆసియాకప్ 2023కి టీమిండియా ఇదే.. జట్టులోకి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ
జట్టులోకి హైదరాబాదీ తిలక్ వర్మ

ఆసియాకప్ 2023కి టీమిండియా ఇదే.. జట్టులోకి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 21, 2023
02:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియాకప్‌ 2023 కోసం టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌లకు అనుకున్నట్టే చోటు దక్కింది. తెలుగు ప్లేయర్ తిలక్ వర్మనూ జట్టులోకి తీసుకున్నారు. సెలెక్షన్ కమిటీ సమావేశానికి చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్‌ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యారు. రోహిత్ నాయకత్వంలో మొత్తం 18 మందితో కూడిన జట్టును సిద్ధం చేశారు. రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), జడేజా, బుమ్రా, షమీ, సిరాజ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ. కాగా, సంజూ శాంసన్‌ను(స్టాండ్ బై) ప్లేయర్‌గా ఎంపిక చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆసియాకప్ 2023కి భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ