భారత్ లో ప్రపంచకప్ ఆడేందుకు పాక్ మెలిక.. ఐసీసీ భేటీలో హైబ్రిడ్ మోడల్ కు పీసీబీ పట్టు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ క్రికెట్ లో పాక్ క్రికెట్ బోర్డు, పాక్ మంత్రి వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. భారత్ లో వన్డే ప్రపంచకప్ ఆడేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది.
ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలయ్యాక తమకు తటస్థ వేదికలు కావాలంటూ తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్టు కోరుతుండటం వివాదాస్పదమైంది.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారతదేశంలోని 10 వేదికల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఇప్పటికే ఐసీసీ రిలీజ్ చేసింది.
ఈ క్రమంలో తమ జట్టు భారత్ రావాలంటే పాక్ ప్రభుత్వం నుంచి తప్పనిసరి అనుమతి కావాలని పీసీబీ వాదిస్తోంది. ఈ విషయాన్ని ఐసీసీ, బీసీసీఐ దృష్టికి పాక్ క్రికెట్ బోర్డు తీసుకెళ్లింది.
details
ప్రకంపనలు రేపుతున్న పాక్ క్రీడాశాఖ మంత్రి వ్యాఖ్యలు
ఈ మేరకు పాక్ ప్రభుత్వం ప్రతినిధులతో కూడిన కమిటీని భారత్‌కు పంపించింది. అంతాసవ్యంగా సాగుతున్న తరుణంలో పాక్ క్రీడాశాఖ మంత్రి ఇసాన్ మజారి, పీసీబీ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఆసియా కప్ ఆడేందుకు పాక్‌కు టీమిండియా రాకుంటే వన్డే ప్రపంచకప్‌లో పాక్ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని రెండు రోజుల కిందట మజారీ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ వారంలో జరగనున్న ఐసీసీ సమావేశంలోనూ ఇదే విషయంపై డిమాండ్ చేయనున్నట్లు పీసీబీ ఛైర్మన్ జకా అష్రాఫ్ స్పష్టం చేశారు.
ఆసియా కప్ సందర్భంగా పాక్‌కు వెళ్లేందుకు బీసీసీఐ అంగీకరించలేదు. దీంతో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో భారత్ ఆడే మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించనుట్లు ప్రకటించింది.