Page Loader
కరేబీయన్ లో రిపోర్టర్లపై రహానే కస్సుబస్సు.. తనలో క్రికెట్ మిగిలే ఉందని స్పష్టం
తనలో క్రికెట్ మిగిలే ఉందని రహానే స్పష్టం

కరేబీయన్ లో రిపోర్టర్లపై రహానే కస్సుబస్సు.. తనలో క్రికెట్ మిగిలే ఉందని స్పష్టం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 11, 2023
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్ తో టీమిండియా తొలి టెస్ట్ రేపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అంద‌రి దృష్టి భార‌త్ టెస్టు జ‌ట్టు వైస్ కెప్టెన్ అజింక్యా ర‌హానేపైనే ఉన్నాయి. రెండేళ్ల కిందట జ‌ట్టులో చోటు కోల్పోయిన ర‌హానే మళ్లీ అద్భుత రీతిలో పుంజుకుని రీఎంట్రీ ఇచ్చాడు. అయితే తొలి టెస్ట్ మ్యాచ్ మొదలుకాకముందే కరేబీయన్ గడ్డపై ఓ ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. ఈ మేరకు అక్కడి రిపోర్టర్లకు రహానే కౌంటర్లు విసిరాడు. 35 ఏళ్ల వ‌య‌సులో జ‌ట్టులోకి వ‌చ్చారు ? రేపటి మ్యాచ్ పై మీ స‌న్న‌ద్ధ గురించి చెప్పండని అడిగిన ప్రశ్నలకు ర‌హానే కొంత అసహనానికి గురయ్యారు. వెంటనే తేరుకుని వ‌య‌సు గురించి ఎందుకు ? నా ఆట‌ను చూడాలని బదులిచ్చాడు.

details

రహానే అనుభవం, నైపుణ్యం దృష్ట్యా  మ‌ళ్లీ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు 

వ‌య‌సుతో ప‌నేంటీ, ఇప్పుడు నాకు 35 ఏళ్లు అని గుర్తు చేసిన రహానే, తాను ఎంతో ఫిట్‌గా, యంగ్‌గా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తన బ్యాటింగ్‌లోని కొన్ని విష‌యాల‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు వివరించారు. అయితే ప్ర‌స్తుతం తాను ఆట‌ను ఎంతో ఆస్వాదిస్తున్నట్లు ర‌హానే వెల్లడించారు. ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో రాణించిన రహానే సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక‌య్యాడు. అంతేకాకుండా తన పదవిని సైతం నిలబెట్టుకోవడం విశేషం. టెస్టుల్లో రహానే అనుభవం, నైపుణ్యం దృష్ట్యా సెలెక్ట‌ర్లు మ‌ళ్లీ వైస్ కెప్టెన్‌ను బాధ్యతలు కట్టబెట్టారు. తొలి టెస్ట్ బుధవారం బార్బ‌డాస్ స్టేడియంలో మొద‌ల‌ుకానుంది. ఈ మేరకు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటల నుంచి లైవ్ మొదలవుతుంది.