PAK vs BAN: పాక్, బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షార్పణం.. ఒక్క విజయం లేకుండానే ఇంటిదారి!
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పాక్ జట్టు పేలవ ప్రదర్శనతో టోర్నమెంట్‌లో ఒక్క విజయం లేకుండానే ఇంటిదారి పట్టింది.
మొదటి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన పాక్, చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచి పరువు కాపాడుకోవాలని భావించింది. అయితే వరుణుడు ఆ అవకాశాన్ని దెబ్బతీశాడు.
వర్షం కారణంగా మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయింది.
Details
ఔట్ ఫీల్డ్ పూర్తిగా తడిచిపోవడంతో మ్యాచ్ ను రద్దు చేసిన అంపైర్లు
గురువారం రావల్పిండిలో ఉదయం నుంచి కురిసిన భారీ వర్షం మైదానాన్ని పూర్తిగా జలమయం చేసింది. ఔట్‌ఫీల్డ్ పూర్తిగా తడిసిపోవడంతో మ్యాచ్ నిర్వహణ అసాధ్యమైంది.
అంపైర్లు టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దు చేయగా, పాక్, బంగ్లాదేశ్ జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
ఒక్క గెలుపు లేకుండానే టోర్నీ ముగించిన బంగ్లా, పాక్
ఈ ఫలితంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఒక్క గెలుపు కూడా లేకుండా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి.
మరోవైపు గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.
ఆదివారం టీమ్ఇండియా, కివీస్ మధ్య మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఎలో అగ్రస్థానాన్ని దక్కించుకుంటుంది.