తదుపరి వార్తా కథనం

Iftikhar Ahmed: దెయ్యాలతో మాట్లాడిన పాక్ బ్యాటర్ ఇఫ్తికర్ ఆహ్మద్.. వైరల్ అవుతున్న వీడియో!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 25, 2023
03:37 pm
ఈ వార్తాకథనం ఏంటి
చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సోమవారం రాత్రి పాకిస్థాన్‌ను ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చేసింది. పాక్ చేసిన 282 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఆఫ్గాన్ చేధించింది.
ఈ మ్యాచులో ఓ ఆసక్తికర సన్నివేశం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
పాకిస్థాన్ క్రికెటర్ ఇఫ్తికర్ అహ్మాద్ మాత్రం బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తనలో తాను గట్టిగా మాట్లాడుకోవడం ఆ వీడియోలో రికార్డు అయింది.
ఆ వీడియోలో షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ కూడా ఉన్నారు. వారిద్దరు ముందు వెళ్తుతుండగా, ఇఫ్తికర్ వెనుక నుంచి ఎవరితో మాట్లాడడం కనిపించింది.
ఇంతకీ ఇఫ్తికర్ ఎవరితో మాట్లాడుతున్నారో చెప్పండంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Can anyone decode why Iftikhar talking to himself?? pic.twitter.com/s403tYWTh0
— 24 (@Chilled_Yogi) October 24, 2023