చివరి వన్డేలో 47 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓటమి
న్యూజిలాండ్ తో జరిగిన ఐదో వన్డేలో పాకిస్తాన్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో వన్డేలో సిరీస్ ను పాకిస్తాన్ 4-1తో కైవసం చేసుకుంది. ఈ ఓటమితో వన్డే ర్యాకింగ్స్ లో పాకిస్తాన్ నంబర్ వన్ స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 39.3 ఓవర్లలో 299 పరుగులు చేసి ఆలౌటైంది. వింగ్ యంగ్(87), కెప్టెన్ టామ్ లాథమ్(59) అర్ధశతకాలతో రాణించారు. చాప్ మన్(43), హెన్రీ నికోల్స్(23), మెక్ కోంచి(26) ఫర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3, ఉసామా మిర్, షాదాబ్ ఖాన్ తలో రెండు వికెట్లు, మహ్మద్ వసీ చెరో వికెట్ తీశారు.
మూడో స్థానానికి దిగజారిన పాకిస్తాన్
లక్ష్య చేధనకు దిగిన పాకిస్తాన్ 46.1 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది. ఇఫ్తికార్ అహ్మద్ (94 నాటౌట్) అద్భుతంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అఘా సల్మాన్ (57), ఫకర్ జమాన్ 33 ఫర్వాలేదనిపించారు. అయితే మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, రవిచన్ రవీంద్ర తలో 3 వికెట్లు పాక్ పతనాన్ని శాసించారు. ఆడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, ఐస్ సోధి తలో ఓ వికెట్ పడగొట్టారు. ఇక వన్డే ర్యాకింగ్స్ లో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా.. టీమిండియా రెండో స్థానానికి ఎగబాకింది. పాకిస్తాన్ మూడో స్థానంలో ఉంది.