
తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన పాకిస్థాన్
ఈ వార్తాకథనం ఏంటి
రావల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ పై పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది. దీంతో ఐదు వన్డేల సిరీస్ లో 1-0 అధిక్యంలో నిలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ 113, విల్‌యంగ్ 86 పరుగులతో రాణించారు.
లక్ష్య చేధనకు దిగిన పాకిస్తాన్.. 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాకిస్థాన్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ (117) సెంచరీతో చెలరేగగా.. ఇమామ్ ఉల్ హాక్ (60) పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
పాక్ బౌలర్లలో నసీంషా, షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ తలా రెండు వికెట్లతో న్యూజిలాండ్ బ్యాటర్ల నడ్డి విరిచాడు.
Details
జమాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
మిచెల్ 22 వన్డేల్లో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు చేశాడు. యంగ్ 78 బంతుల్లో 86 పరుగులు చేశాడు. యంగ్ 11 వన్డేల్లో 54.75 సగటుతో 438 పరుగులు చేశాడు.
వన్డేల్లో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలను బాదాడు. ఆరో వన్డే ఆడుతున్న పాకిస్తాన్ బౌలర్ నసీమ్ 12.75 సగటుతో 20 వికెట్లు తీశాడు.
ఫఖర్ ఈ సెంచరీతో వన్డేలో వన్డేల్లో 9 సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బాబర్ వన్డేల్లో 59.29 సగటుతో 4,862 పరుగులు చేశాడు.
కాగా సెంచరీతో చెలరేగిన జమాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.