Asia Cup 2023: ఆసియాకప్‌లో పాకిస్థాన్ బోణీ.. నేపాల్ పై ఘన విజయం
ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్ ముల్తాన్ వేదికగా నేపాల్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. బాబర్ ఆజమ్(151),ఇఫ్తికార్ అహ్మద్(109*) రన్ లతో విరుచుకుపడ్డారు. ఫకర్ జమాన్ (14), ఇమామ్ ఉల్ హాక్ (5), అఘా సల్మాన్ (5) విఫలమయ్యారు. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కామీ 2 వికెట్లు,కరణ్, సందీప్ లామిచ్చేన్ తలో వికెట్ తీశారు.
షాదాబ్ ఖాన్ ధాటికి నేపాల్ విలవిల
అనంతరం 343 పరుగుల లక్ష్యానికి ఛేదించడానికి బ్యాటింగ్ కి దిగిన నేపాల్ ఆరంభంలోనే పాకిస్థాన్ బౌలర్ షహీన్ షా ధాటికి తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. అప్పటికి నేపాల్ స్కోర్ 10,అటు తరువాత 14 రన్స్ కి మూడు వికెట్ ను కోల్పోయి పీకలలోతు కష్టాలలో పడింది. ఆ దశలో సోంపాల్, ఆరిఫ్ కాసేపునిలబడడంతో నేపాల్ 73/3తో నిలిచింది. కానీ ఈ భాగస్వామ్యం విడిపోయాక ఆ జట్టు ఇన్నింగ్స్ పేకమేడల కుప్ప కూలిపోయింది.23.4 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ (4/27),షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ చెరో 2 వికెట్లు,నసీం షా, నవాజ్ తలో వికెట్ పడగొట్టారు.