పాకిస్తాన్ క్రికెట్‌లో ఫిక్సింగ్ కలకలం, 2 ఏళ్లపాటు ఆటగాడిపై నిషేధం
మ్యాచ్ ఫిక్సింగ్ లో పాక్ ఆటగాళ్లు మరోసారి బయటపడ్డారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫిక్సింగ్ లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం మరో పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు ఈ మహమ్మరికి బలి అయ్యారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన ఆసీఫ్ అఫ్రిది పీసీబీ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు పీసీబీ రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ప్రస్తుతం ఈ ఆటగాడు సెప్టెంబర్ 12, 2024 వరకు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆఫ్రిధిపై జీవిత కాల నిషేధాన్ని విధించే అవకాశం ఉన్నా.. అతడు నేరాన్ని అంగీకరించి పశ్చాత్తాపం పొందినందుకు పీసీబీ శిక్షను తగ్గించిందని పిసిబి ఛైర్మన్ నజం సౌథి చెప్పారు.
అఫ్రిది సాధించిన రికార్డులివే
36 ఏళ్ల అఫ్రిది ఇప్పటివరకు 35 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 25.37 సగటుతో 118 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో, 42 మ్యాచ్ లు ఆడి 59 వికెట్లు పడగొట్టాడు. అతను 65 టీ20 మ్యాచ్ లో 6.97 ఎకానమీ రేటుతో 63 వికెట్లు తీశాడు. అఫ్రిది ఇంకా అంతర్జాతీయ క్రికెట్ ఆడనప్పటికీ, అతను గతేడాది ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్ కోసం పాకిస్తాన్ టీ20, వన్డే స్క్వాడ్‌లలో పేరును సంపాదించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున కూడా ఆడాడు. అతను ఐదు గేమ్‌లలో ఎనిమిది వికెట్లను తీశాడు.