Page Loader
Pakistan: పాకిస్థాన్ వరల్డ్ కప్ జట్టు ప్రకటన! హాసన్ అలీ రీ ఎంట్రీ
పాకిస్థాన్ వరల్డ్ కప్ జట్టు ప్రకటన! హాసన్ అలీ రీ ఎంట్రీ

Pakistan: పాకిస్థాన్ వరల్డ్ కప్ జట్టు ప్రకటన! హాసన్ అలీ రీ ఎంట్రీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2023
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్ కప్ 2023 సమరం ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచ కప్ టోర్నీ అక్టోబర్ 5న భారత్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం చాలా దేశాలు తమ వరల్డ్ కప్ స్క్వాడ్ లను ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా పాకిస్థాన్ జట్టు తమ వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది. బాబర్ అజయ్ సారిథిగా 15 మందితో కూడిన జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వైస్ కెప్టెన్‌గా షాదాబ్ ఖాన్ కొనసాగనున్నాడు. గాయం కారణంగా నసీమ్ షా స్థానంలో హసన్ అలీకి చోటు లభించింది.

Details

వన్డే వరల్డ్ కప్ లో చోటు దక్కించుకున్న హరీస్ రవూఫ్

ఒకప్పుడు వన్డే బౌలర్‌గా అగ్రస్థానంలో నిలిచిన హసన్, పేలవ ప్రదర్శనల కారణంగా గతేడాది పాకిస్థాన్ జట్టులో చోటు కోల్పోయాడు. ఆసియా కప్ 2023లో గాయపడిన హరీస్‌ రౌఫ్‌ గాయం నుంచి కోలుకోవడంతో అతన్ని వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి ఎంపిక చేశారు ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అలీ ఆఘా, షాదాబ్ ఖాన్, ఉసామా మీర్, మహ్మద్ నవాజ్, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్ వసీం జూనియర్, హసన్ అలీ.