
Shahid Afridi: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సోదరి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహీద్ ఆఫ్రిది ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆఫ్రిది సోదరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచింది.
ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అఫ్రిది వెల్లడించారు. ఆఫ్రిది సొదరి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
అయితే సోమవారం సాయంత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిని అఫ్రిది పరామర్శించాడు.
అనంతరం తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన సొదరి తన జీవితం కోసం పోరాడుతోందని, ఆమె అరోగ్యం కోసం దువాస్ చేయాలని అఫ్రిది అన్నాడు.
అయితే మంగళవారం ఉదయం ఆమె చనిపోయినట్లు అఫ్రిది ధ్రువీకరించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తన సోదరి మరణాన్ని తెలియజేసిన ఆఫ్రిది
I am travelling back to see you soon my love stay strong
— Shahid Afridi (@SAfridiOfficial) October 16, 2023
My sister is fighting for her life right now, I request you to make Duas for her health, will mean a lot. May Allah give her speedy recovery and a long healthy life Ya Rabb pic.twitter.com/CqvqNLCIEF